![]() |
![]() |

శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ వారం "ఐ హేట్ యు" సెగ్మెంట్ ప్రసారం చేశారు. ఈ సెగ్మెంట్ స్టార్టింగ్ సూపర్ సీరియస్ గా చూపించేసరికి ఆడియన్స్ కూడా ఇంకేముంది కాంట్రవర్సీ ఐపోతుందని ఎదురు చూసారు. బట్ అదంతా ఫుల్ రాంగ్ అని ఫైనల్ లో అర్ధమౌతుంది. రాంప్రసాద్, పరదేశి, రష్మీ ముగ్గురు కూడా ఆది ఫోటోని చింపేసి కాల్చేస్తారు. ఇక ఏదో జరిగిపోతోంది శ్రీదేవి డ్రామా కంపెనీ కాస్త కాంట్రవర్సీ కంపెనీ ఐపోతుందనుకున్న వాళ్ళ ఊహలన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టే ఆన్సర్స్ ఇచ్చేసరికి నవ్వుకోలేక చచ్చారు ఆడియన్స్. ఆది టిక్ టాక్ చేసే ముగ్గురు అమ్మాయిల నంబర్లు తీసుకున్నాడు కానీ ఒక్క నంబర్ కూడా తనకి ఇవ్వలేదని అందుకో ఫోటో చింపేశానని రాంప్రసాద్ చెప్పాడు. ఎపిసోడ్ ఎంట్రీలో ఆది చెప్పాడట చించే పెర్ఫార్మన్స్ లు చేయాలని అందుకే ఎపిసోడ్ లో ఉన్న ప్రతీది చించేయాలని అందుకే ముందు ఆది అన్న ఫోటో చింపేశానని పరదేశి చెప్తాడు. ఇమ్ము వచ్చి రాంప్రసాద్ ఫోటో చింపేస్తాడు అన్ని ఫోటోలు బాగున్నాయి కానీ ఆ ఫోటో ఒక్కటి నచ్చలేదట అందుకే చింపేసినట్లు చెప్పాడు. పూర్ణ వచ్చి రష్మీ ఫోటో చింపేస్తుంది ఎందుకంటే ఎప్పుడూ ఈ షోకి వచ్చినా రష్మీ అందం తనని బాధపెడుతూనే ఉంటుందట.
అంత అందంగా ఎందుకు ఉన్నావ్ అంటూ ఫన్నీగా అడుగుతుంది పూర్ణ. ఫైనల్ గా పంచ్ ప్రసాద్ వచ్చి భాస్కర్ ఫోటోని చింపుదామనుకున్నా కానీ నా ఫోటో నేనే చింపేసుకోవాల్సి వస్తోంది అంటూ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే సునంద తన ఫోటో తనకే చూపించి ఇమ్మానుయేల్ ఫోటో నా అని అడిగిందట..వేరేవాళ్లను అడిగితే పర్లేదు కానీ నా ఫోటోలో ఉన్న నన్నే గుర్తుపట్టకుండా ఎవరు అంటూ నన్నే అడిగేసరికి హర్టింగ్ అనిపించింది అందుకే నా ఫోటోలు నేను చింపేసుకున్న అంటూ పంచ్ ప్రసాద్ పంచ్ డైలాగ్ తో అందరినీ నవ్వించాడు. ఇక తర్వాత ఆది వచ్చి రాంప్రసాద్ ఫోటో చింపేసాడు. రాంప్రసాద్ నేను ఒక్క అమ్మాయి నంబర్ కూడా ఇవ్వలేదని ఫీల్ అయ్యాడు. కానీ అంతకుముందు రాంప్రసాద్ ఐదుగురు అమ్మాయిల నంబర్లు తీసుకున్నాడు కానీ నాకు ఒక్క నంబర్ కూడా ఇవ్వలేదంటూ ఫీల్ అయ్యాడు. ఫైనల్ గా రష్మీ ఈ సెగ్మెంట్ పై క్లారిటీ ఇచ్చేసింది. తమ మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని చెప్పింది.
![]() |
![]() |